శ్రీవారి.దర్శనానికి వచ్చిన. భక్తుడికి గుండెపోటు.రాగా ఓ కానిస్టేబుల్ ప్రాణాలు.కాపాడారు
తిరుమల 17 ఆగస్టు (హి.స.) , : శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చిన ఓ భక్తుడికి గుండెపోటు రాగా ఓ కానిస్టేబుల్‌ దేవుడిలా వచ్చి ఆయనను కాపాడారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లికి చెందిన మేడం శ్రీనివాసులు (61) కుటుంబ సభ్యులతో కలిసి శుక్ర
శ్రీవారి.దర్శనానికి వచ్చిన. భక్తుడికి గుండెపోటు.రాగా ఓ కానిస్టేబుల్ ప్రాణాలు.కాపాడారు


తిరుమల 17 ఆగస్టు (హి.స.)

, : శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చిన ఓ భక్తుడికి గుండెపోటు రాగా ఓ కానిస్టేబుల్‌ దేవుడిలా వచ్చి ఆయనను కాపాడారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లికి చెందిన మేడం శ్రీనివాసులు (61) కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం లడ్డూలు తీసుకుని మ్యూజియం వైపు వెళ్తుండగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. అక్కడే విధుల్లో ఉన్న తిరుమల వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ గుర్రప్ప సమయస్ఫూర్తితో వ్యవహరించి శ్రీనివాసులుకు సీపీఆర్, ప్రథమ చికిత్స చేశారు. కాస్త కోలుకోగానే తొలుత తితిదే అశ్విని ఆసుపత్రికి, అనంతరం తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు. శ్రీనివాసులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande