తిరుమల, 17 ఆగస్టు (హి.స.)ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొండపై భక్తుల రద్దీ నెలకొంది.
వారాంతం కావటంతో తిరుమలకు (Tirumala) భక్తులు (Devotees) పోటెత్తారు. దీంతో ఆదివారం (ఆగస్టు 17) శ్రీవెంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లన్నీ నిండిపోయి బయట శిలతోరణం వరకు వేచి ఉన్నారు. అలాగే, స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న (ఆగస్టు 16) స్వామివారిని 87,759 మంది భక్తులు దర్శించుకోగా, 42,043 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే శ్రీవెంకటేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి