విశాఖపట్నం, 17 ఆగస్టు (హి.స.)
ఓట్ చోరీ విషయంలో వస్తున్న
ఆరోపణలపై స్పందించకుండా కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకే అనుకూలంగా వ్యవహరహించే ప్రయత్నం అత్యంత ప్రమాదకరం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఓట్లను తొలగిచండం అంటే పౌర హక్కులను కాలరాయడమేనని ఓట్ల చోరీకి పాల్పడుతూ బీజేపీ లబ్ధి పొందుతున్నదని విమర్శించారు. ఇవాళ జనసేన పార్టీ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుమార్తె నిశ్చితార్థ వేడుకలకు హాజరయ్యేందుకు భట్టి విక్రమార్క ఏపీలోని విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓటు చోరీ జరిగిన తీరును కళ్లకు కట్టేవిధంగా రాహుల్ గాందీ దేశ ప్రజలకు నిరూపించారన్నారు. బిహార్ లో రాహుల్ గాంధీ తలపెట్టిన ఓట్ అధికార్ యాత్రకు రాజకీయ పక్షాలు, ప్రజలు, ప్రజాస్వామికవాదుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..