ఆంధ్రప్రదేశ్ లో భారీ.వర్షాలు పశ్చిమ గోదావరింజిల్లాలకు.రెడ్.అలెర్ట్
అమరావతి, 17 ఆగస్టు (హి.స.) విశాఖపట్నం: దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం ) కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని, ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్
ఆంధ్రప్రదేశ్ లో భారీ.వర్షాలు పశ్చిమ గోదావరింజిల్లాలకు.రెడ్.అలెర్ట్


అమరావతి, 17 ఆగస్టు (హి.స.)

విశాఖపట్నం: దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం ) కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని, ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ భారతి సవ్వడి తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు ( కురుస్తాయని చెప్పారు. విశాఖ, అనకాపల్లి, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్‌ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande