హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.) కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కి పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం మల్లు రవి మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తనతో మాట్లాడారని చెప్పారు. చాలా సేపు చర్చించినట్లు తెలిపారు. సమస్య రిపీట్ కాకుండా ఒకసారి చెప్పి చూస్తాం.. మళ్లీ రిపీట్ అయితే తప్పకుండా రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని మల్లు రవి వార్నింగ్ ఇచ్చారు. అనంతరం వరంగల్ పంచాయితీపై మల్లు రవి వివరణ ఇచ్చారు. వరంగలు నలుగురిని పంపించబోతున్నట్లు తెలిపారు. ఎవరెవరు వెళ్లాలి అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని అన్నారు. తాను పార్టీలో మంటలు పెట్టడానికి లేను.. నా పని ఫైరింజన్ అని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..