వరదల పై పకడ్బందీ చర్యలకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలి : మంత్రి సీతక్క
మహబూబాబాద్, 17 ఆగస్టు (హి.స.) రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యంత్రాంగం ముందస్తు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, జిల్లా స్థాయి నుండి గ్రామస్థాయి వరకు సిబ్బంది ప్రధాన కార్యస్థానంలోనే ఉం
మంత్రి సీతక్క


మహబూబాబాద్, 17 ఆగస్టు (హి.స.)

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యంత్రాంగం ముందస్తు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, జిల్లా స్థాయి నుండి గ్రామస్థాయి వరకు సిబ్బంది ప్రధాన కార్యస్థానంలోనే ఉండాలని, యూరియా కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ప్రభుత్వ విప్ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ లెనిన్ వత్సల్ టోప్పో, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, సంబంధిత అన్ని విభాగాల అధికారులతో వర్షాలు, వరదల పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో వరదలు, వాగులు లో లెవెల్ వంతెనలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని, జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, గత సంవత్సరం వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, ఈసారి అలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, అన్ని విభాగాల సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. మండల స్థాయిలో సంబంధిత అన్ని విభాగాల సిబ్బందితో కలిసి కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ కమిటీలో రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, సంబంధిత అధికారులతో ఎమ్మెల్యేలు, ఎంపీలను, సీనియర్ అధికారులను నియమించాలని, వారి సూచనలు, సలహాల ప్రకారం పక్కా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande