హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలో లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి మొదటి విడత సర్వేయర్ల శిక్షణ పూర్తయిందని రెండో విడత శిక్షణ 23 జిల్లా కేంద్రాల్లో ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్ధులు ఆయా జిల్లాల్లో 18వ తేదీ ఉదయం 10 గంటల లోపు సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్కు రిపోర్ట్ చేయాలని సూచించారు. లైసెన్స్ డ్ సర్వేయర్ల నియామకంపై ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన నేపధ్యంలో ఇందుకు అవసరమైన లైసెన్స్ సర్వేయర్ల సేవలను గాంధీ అందుబాటులోకి జయంతి రోజునాటికి తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..