ముంపు ప్రాంతాల్లో పర్యటించిన నిర్మల్ జిల్లా కలెక్టర్..
తెలంగాణ, నిర్మల్. 17 ఆగస్టు (హి.స.) నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ ఆదివారం నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీలో ప్రత్యక్షంగా పర్యటించారు. కాలనీలో వరద నీరు ప్రవ
నిర్మల్ కలెక్టర్


తెలంగాణ, నిర్మల్. 17 ఆగస్టు (హి.స.)

నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ ఆదివారం నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీలో ప్రత్యక్షంగా పర్యటించారు. కాలనీలో వరద నీరు ప్రవహించడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా భారీ వర్షాలతో కాలనీలో చేరిన వరద నీరు, తలెత్తిన ఇబ్బందులను కాలనీవాసులు అధికారులకు వివరించారు. కాలనీలో వరదనీరు ప్రవహించినప్పుడు నీటిపారుదల, మున్సిపల్ శాఖల అధికారులు చేపడుతున్న సహాయక చర్యల పై ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు.

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయ మవుతున్నాయని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపడుతున్నామని ప్రత్యేక అధికారి హరి కిరణ్ స్పష్టం చేశారు. కాలనీలో వరదనీటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande