తిరుపతి, 17 ఆగస్టు (హి.స.)
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఏ ఆర్టీసీ బస్సులలోనూ ఫ్రీ బస్సు స్కీం వర్తించదని తిరుమల డిపో అధికారులు స్పష్టం చేశారు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లు(రూ. 90), గరుడ ఏసీ(రూ. 110), ప్యాకేజీ టూర్ బస్సులకు ఈ పధకం వర్తించదన్నారు. తిరుమలకు వచ్చే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు దీనిని గమనించగలరని ఆర్టీసీ అధికారులు సూచించారు.
తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల నుంచి భక్తుల సౌకర్యార్థం శ్రీవారి మెట్టుకు మరిన్ని బస్సు సర్వీసుల పెంపుదలకు టీటీడీ అధికారులు ఆర్టీసీని కోరారు. అటు రాష్ట్రవ్యాప్తంగా నాన్-స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఈ స్కీం లేదు.
పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. జీరో టికెట్‌తో అనేక మంది మహిళలు లబ్ది పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి