తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 17 ఆగస్టు (హి.స.)
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని
జిల్లా సమీకృత కార్యాలయం
కాంప్లెక్స్ (కలెక్టరేట్) లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు వినతులు ఇవ్వడానికి సోమవారం కలెక్టరేట్ కు రావద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విధులు అధికారులు అందరూ నిర్వహిస్తున్న క్రమంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి వారి సమస్యల పై దరఖాస్తులు ఇవ్వడానికి సోమవారం కలెక్టరేట్ కు రావద్దని జిల్లా కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు