స్థానిక ఎన్నికలపై బిగ్ అప్ డేట్.. సీఎంతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ
హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.) రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో నిర్వహించబోతున్నది. ఈ మేరకు పీఏస
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో నిర్వహించబోతున్నది. ఈ మేరకు పీఏసీ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు సూచించారు. ఆదివారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం అయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితర నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. అయితే సరిగ్గా వారం క్రితం సీఎంతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ నెల 16న లేదా 17న పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కానీ అది జరగలేదు. తాజాగా ఈ ఇరువురు మరోసారి సమావేశం కావడం రాజకీయంగా ఇంట్రెస్టింగ్ గా మారింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande