' బురద రాజకీయాల కోసం.. వరద నీటికి సముద్రంలోకి వదులుతారా '?..హరీష్ రావు
సిద్దిపేట, 17 ఆగస్టు (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వం తీరు పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కట్టిన ఇళ్లు.. పెట్టిన పొయ్యి మాదిరి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద నీటిని ఎత్తి పోసి రైతాంగానికి సాగునీటి కొరత లేకుండా చూడాల్సింది పో
హరీష్ రావు


సిద్దిపేట, 17 ఆగస్టు (హి.స.)

కాంగ్రెస్ ప్రభుత్వం తీరు పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కట్టిన ఇళ్లు.. పెట్టిన పొయ్యి మాదిరి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద నీటిని ఎత్తి పోసి రైతాంగానికి సాగునీటి కొరత లేకుండా చూడాల్సింది పోయి బురద రాజకీయాల కోసం.. కృష్ణ గోదావరి నదుల వరద నీటికి సముద్రంలోకి వదులుతున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తి పోసి రైతాంగానికి సాగునీరు అందిస్తే మాజీ సీఎం కేసీఆర్ కు పేరు వస్తుందన్న అక్కసుతో ప్రాజెక్టులను పడావు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పిన కాంగ్రెస్ నాయకులు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడానికి నేడు మోటర్లు ఆన్ చేయడం లేదన్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి ప్రతి రోజు 15 టీఎంసీల వరద నీరు వస్తుందన్నారు.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande