ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు.. ఫార్మా సిటీ భూములపై కేటీఆర్ వ్యాఖ్యలు
హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్ సిటీ కి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూములలో రియల్ ఎస్టేట్ వ్య
కేటీఆర్


హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్ సిటీ కి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆకాంక్ష నెరవేరదని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ లేని నాయకుడని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజాధనం వృధా అవుతుందని ఆయన ఆరోపించారు. ఫార్మా సిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande