తెలంగాణను వదిలి వెళ్లే వరకు మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటం.. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్.. .
హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.) మార్వాడీ లకు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క కొత్త షాపు పెట్టినా ఊరుకోము అని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ''మార్వా
పిడమర్తి రవి


హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)

మార్వాడీ లకు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క కొత్త షాపు పెట్టినా ఊరుకోము అని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే 'మార్వాడీ గో బ్యాక్' ఉద్యమం చేపడతాం అని కీలక ప్రకటన చేశారు. తెలంగాణను వదిలి వెళ్లే వరకు వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అన్నారు. మార్వాడీ వ్యాపారులు జీఎస్టీ కట్టరు, బిల్లు ఇవ్వరు, ఇక్కడ డబ్బులు దండుకొని గుజరాత్, రాజస్థాన్కు వెళ్తారని హాట్ కామెంట్స్ చేశారు. మార్వాడీల చందాలతో బీజేపీ బతుకుతోంది.. అందుకే బండి సంజయ్ వారికి మద్దతు ఇస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం నాటి ఆమనగల్ బంద్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande