విశాఖపట్టం, 17 ఆగస్టు (హి.స.) విశాఖ(Visakha)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి మంటలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా లీక్ అయింది. వెంటనే మంటలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అనధికారికంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి