శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వేడుకగా ఆడికృత్తిక
తిరుపతి, 17 ఆగస్టు (హి.స.)తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం ఆడికృత్తిక పర్వదినం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చం
్


తిరుపతి, 17 ఆగస్టు (హి.స.)తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం ఆడికృత్తిక పర్వదినం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

మధ్యాహ్నం మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూప‌రింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ బాలకృష్ణ, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande