ముస్లిం ప్రార్థనా స్థలంపై హిందూ జెండా
న్యూఢిల్లీ: , 17 ఆగస్టు (హి.స.) మధ్యప్రదేశ్‌ రాష్ట్రం రేవా జిల్లాలోని గోర్గి గ్రామంలో శుక్రవారం రాత్రి కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు ఓ ముస్లిం ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేశాయి. వారు ఆ దర్గా గోపురంపై మతపరమైన (హిందూ)జెండాను ఉంచారు. శనివారం ఉదయం ముస్
ముస్లిం ప్రార్థనా స్థలంపై హిందూ జెండా


న్యూఢిల్లీ: , 17 ఆగస్టు (హి.స.)

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం రేవా జిల్లాలోని గోర్గి గ్రామంలో శుక్రవారం రాత్రి కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు ఓ ముస్లిం ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేశాయి. వారు ఆ దర్గా గోపురంపై మతపరమైన (హిందూ)జెండాను ఉంచారు. శనివారం ఉదయం ముస్లిం సమాజానికి ఈ విషయం తెలిసింది. దీంతో అక్కడికి జనాలు భారీగా తరలి వచ్చారు. ఈ అంశంపై పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని దెబ్బతిన్న దర్గా నిర్మాణ పనులను ప్రారంభించారు. గుర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గోర్గి గ్రామంలో ముస్లిం సమాజ విశ్వాసానికి ప్రతీక అయిన ఘాజీ మియా సమాధి ఇందులో ఉంది. ఇది చాలా పురాతనమైనది అని చెబుతారు. శుక్రవారం మధ్యాహ్నం ముస్లింలు ప్రార్థనలు సైతం చేశారు. అప్పటి వరకు అంతా బాగానే ఉందని చెబుతున్నారు. కానీ, రాత్రి సమయంలో కొంతమంది దుండగులు సమాధిని ధ్వంసం చేసి దానిపై మతపరమైన జెండాను ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande