అమరావతి, 2 ఆగస్టు (హి.స.)
: గత ప్రభుత్వం వదిలివెళ్లిన రూ.26 వేల కోట్ల అప్పులు తీర్చినట్లు బయో డైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ అన్నారు. విద్యా ఫీజు, ధాన్యం రైతుల బకాయిలు చెల్లిస్తున్నామన్నారు. శనివారం మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచి ఇచ్చామని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు తల్లికి వందనం ఇస్తున్నామన్నారు.
‘‘జగన్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. మేం అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు తగ్గించాం. అయినా ఆదాయం పెరిగింది. వైకాపా హయాంలో లిక్కర్ డబ్బు ఖజానాలోకి చేరలేదు. బయటకు వెళ్లింది. మద్యం ఆదాయం చాలావరకు ఆ పార్టీ నాయకుల ఖాతాల్లోకి మళ్లింది’’ అని విజయ్‌కుమార్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ