ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నావ్? రేవంత్ రెడ్డిపై ఈటల ఫైర్
హైదరాబాద్, 2 ఆగస్టు (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలతో కాలం గడిపేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన నీ మాట ఏమైంది మిస్టర్ రేవంత్ రెడ్డి.. అని
ఈటెల రాజేందర్


హైదరాబాద్, 2 ఆగస్టు (హి.స.)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలతో కాలం గడిపేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన నీ మాట ఏమైంది మిస్టర్ రేవంత్ రెడ్డి.. అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బీసీలతో పాటు అన్ని వర్గాలు మరోసారి వంచనకు గురయ్యామని రేవంత్ రెడ్డి మాటలకు మోసపోయామని భావిస్తున్నాయన్నారు. ఇవాళ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న ఈటల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఏదో డ్రామా చేసి కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అవుతుందన్నారు. దమ్ముంటే చర్చకు రా.. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎంత మంది ఓబీసీ మంత్రులకు అవకాశం ఇచ్చారో లెక్కలు తీద్దామన్నారు. రాజ్యాంగ బద్ధంగా లెక్కలు తీసి షెడ్యూల్ 9 లో రిజర్వేషన్లు పొందుపర్చుకున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు అన్నారు. బీఆర్ఎస్ ఉన్నంత కాలం ఒక బీసీ దానికి అధ్యక్షుడు అయ్యే అస్కారం ఉందా? ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఇన్నేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీ ముఖ్యమత్రినైనా చేశారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేకపోయారు. బీసీ మంత్రులకు మామూలు మంత్రిత్వ శాఖలే ఇచ్చారని రెవెన్యూ శాఖ, అర్బన్ డెవలప్ మెంట్ శాఖలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande