అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజా పక్షంలో నిలుస్తుంది.. రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, 2 ఆగస్టు (హి.స.) కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని బీజేపీ ప్రశ్నిస్తోందని 140 ఏళ్ల కిందటే ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు కదంతొక్కిందే కాంగ్రెస్ పార్టీ అని బ్రిటీష్ పాలకులను తరిమికొట్టింది కాంగ్రెస్సే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అ
రేవంత్ రెడ్డి


న్యూఢిల్లీ, 2 ఆగస్టు (హి.స.)

కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని బీజేపీ ప్రశ్నిస్తోందని 140 ఏళ్ల కిందటే ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు కదంతొక్కిందే కాంగ్రెస్ పార్టీ అని బ్రిటీష్ పాలకులను తరిమికొట్టింది కాంగ్రెస్సే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ సహా మిగతా పార్టీలు అధికారం లేకపోతే ఇంటికి పరిమితం అవుతాయి. కానీ అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజా పక్షంలో నిలుస్తుందన్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన ఐఐసీసీ లీగల్ సెల్ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇందిరా గాంధీ పాకిస్తాన్ ను ముక్కలు చేసిందని, తీవ్రవాదంపై పోరాటం చేసి ఇందిరా, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగం చేశారన్నారు. ప్రధాని పదవిని త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీ అని చెప్పారు. దేశం కోసం మన్మోహన్ ను ప్రధానిని చేశారన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో అవకాశం వచ్చినా కేంద్ర మంత్రి పదవిని, ప్రధాన మంత్రి పదవిని తీసుకోకుండా సీనియర్లకు అవకాశం ఇచ్చి తాను కార్యకర్తలా పేద ప్రజల కోసం పని చేస్తున్నారన్నారు. పదవులు త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిదని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande