తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 2 ఆగస్టు (హి.స.)
ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై చేసిన దాడిని బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుందని, పెహల్గాం దాడిలో పాల్గొన్న వాళ్లలో ఎంత మంది పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపారో కేంద్ర ప్రభుత్వం చెప్పలేకపోతుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం సీపీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ పై విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం వద్ద సరైన సమాధానం లేదన్నారు. ప్రధాని మోదీ తన అనుకూల మీడియాతో ప్రపంచానికి అబద్ధాలు వల్లెవేశారని కానీ అంతర్జాతీయ ఛానెళ్లు భారత ప్రభుత్వ మీడియాను అవహేళన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ హిందూ – ముస్లింలను రెచ్చగొడుతూ వక్ర బుద్ధిని చూపిస్తున్నాయని దుయ్యబట్టారు. భారత్ – పాక్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రచారం చేసుకుంటుంటే అది నిజామా? అబద్దమా? అని విపక్ష సభ్యులు అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. ఇది మోదీ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు