అమరావతి, 2 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఆగస్టు 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఈలోగా నోటీసులు జారీ చేయాలని తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసు, సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్‌పై సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ