తెలంగాణ, కరీంనగర్. 2 ఆగస్టు (హి.స.)
కరీంనగర్ జిల్లా చొప్పదండి సైకిళ్ళ
పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. మంత్రి పదవి నాకు వద్దని చెప్పలేదు, కావాలని నేను అధిష్టానాన్ని అడగలేదన్నారు. క్రమశిక్షణ గల బీజేపీ పార్టీలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలాంటింది కాదు బీజేపీ అన్నారు. నాకు మా నాయకత్వం ఏ బాధ్యత ఇచ్చినా నేను నిర్వహిస్తా.. రైతును రారాజును చేయడమే నరేంద్ర మోడీ లక్ష్యం.. 11 ఏళ్లలో రైతుల కోసం రూ.71 లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మోడీదే అని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఇక, రైతులు ఎరువుల కోసమే సబ్సిడీ రూపంలో రూ.11 లక్షల కోట్లకు పైగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. కనీస మద్దతు ధర అందించేందుకు 16 లక్షల 35 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది మోడీ సర్కార్.. అలాగే, కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతుల ఖాతాల్లో రూ.3 లక్షల 69 వేల 561 కోట్లు జమ చేశాం.. పదవ తరగతి బాగా చదివి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు స్కూటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు