ఇది మరో మోసం.. బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 2 ఆగస్టు (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 2 ఆగస్టు (హి.స.)

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇద్దామనుకునే 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కాదు.. మతపరంగా ఓట్ల కోసం కాంగ్రెస్ తెచ్చిన కోటా అని ఆరోపించారు. గతంలో 34 శాతం రిజర్వేషన్లు ఉంటే.. వాటిని కేసీఆర్ 23 శాతానికి తగ్గించారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ 42 శాతం అంటూ మరో మోసానికి తెరలేపింది. 42 శాతంలో 10 శాతం ముస్లింలకు తీసేస్తే బీసీలకు మిగిలేది ఎంత అని ప్రశ్నించారు. బీసీలకు 32 శాతం కూడా దక్కడం లేదని అన్నారు. 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే ఇప్పుడు ఎందుకు తగ్గించారని అడిగారు. బీసీలకు అన్యాయం చేసే చట్టాన్ని కాంగ్రెస్ తీసుకొస్తోందని ఆరోపించారు.

అందుకే కులగణన కూడా సరిగా చేయలేదని అన్నారు. హైదరాబాద్లో 20 శాతం ఇళ్లలో కూడా సర్వే చేయలేదని చెప్పారు. అంతేకాదు.. కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక్క బీసీ వ్యక్తిని కూడా ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రిని చేయలేదని గుర్తుచేశారు. యూపీఏ పదేళ్లు అధికారంలో ఉన్నా బీసీ కులగణన చేయలేదని అన్నారు. దీనిపై రాహుల్ గాంధీ పార్లమెంట్లో ముక్కు నేలకు రాసిన తర్వాతనే కులగణనపై మాట్లాడాలని చెప్పారు. దేశ చరిత్రలో స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి కులగణనకు బీజేపీ సిద్ధమైందని వెల్లడించారు. అయినా ఇవేమీ గమనించికుండా రాహుల్ గాంధీ స్థాయికి మించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande