నందికొట్కూరు, 2 ఆగస్టు (హి.స.), . ఆవినీతికి అడ్డాగా ఆర్డీవో కార్యాలయం మారింది. ప్రతి పనికో రేటును విధించి రైతులను, బాధితులను పదేపదే తమ చుట్టూ తిప్పుకుంటున్నారనడానికి గురువారం జూపాడుబంగ్లా వద్ద ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్ రమేష్ చిక్కడమే ఇందుకు ఒక నిదర్శనం. డివిజన్తో పాటు ఆయా మండలాల్లో జనన, మరణ ధృవీకరణ పత్రాలను మొదలుకొని, భూముల మ్యుటేషన్, ఆర్ వోఆర్‌లో మార్పు, తహసీల్దార్ లేఖలు, రెగ్యులైజేషన్, ఫైనాన్స్ స్టేటస్ సర్టిఫికేషన్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటును నిర్ణయించి వసూళ్లు చేస్తున్నట్లు పలు ఆరోపణలున్నాయి. ఫైనాన్స్ స్టేటస్ సర్టిఫికేషన్ కోసం రూ.30 వేలు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. చివరకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న బాధితుల నుంచి కూడా డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఓ అధికారి నేరుగా తన పోనేపే నెంబర్‌ను బాధితులకు ఇచ్చి నగదును తీసుకుంటున్నారన్నది విశ్వసనీయ
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ