మంత్రి కొండా సురేఖకు షాక్.. క్రిమినల్ కేసు నమోదుకు కోర్ట్ ఆదేశం
హైదరాబాద్, 2 ఆగస్టు (హి.స.) మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఫోన్ ట్
కొండ సురేఖకొండ సురేఖ


హైదరాబాద్, 2 ఆగస్టు (హి.స.)

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఫోన్ ట్యాంపింగ్, డ్రగ్స్, టాలీవుడ్ హీరోయిన్ సమంత విడాకుల వ్యవహారంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. కేటీఆర్పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో నిందితురాలు కొండా సురేఖపై ఆగస్టు 21 లోగా క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితురాలికి నోటీసు జారీ చేయాలని స్పష్టం చేసింది. కేటీఆర్పైన మంత్రి నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ తరఫున న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఫిర్యాదుతోపాటు సాక్ష్యుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్ల పరిశీలించిన తర్వాత ఆదేశాలు జారీ చేసింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande