యోగా సాధన జీవితంలో భాగం కావాలి : మాజీ మంత్రి హరీష్ రావు
సిద్దిపేట, 2 ఆగస్టు (హి.స.) ఉరుకుల పరుగుల జీవన విధానంలో సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా సాధన జీవితంలో భాగం చేసుకొని ప్రతి రోజు సాధన చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో అస్మిత యోగాసన
హరీష్ రావు


సిద్దిపేట, 2 ఆగస్టు (హి.స.)

ఉరుకుల పరుగుల జీవన

విధానంలో సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా సాధన జీవితంలో భాగం చేసుకొని ప్రతి రోజు సాధన చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో అస్మిత యోగాసన సిటీ లీగ్ - 2025-26 కార్యక్రమానికి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కరోనా ప్రపంచానికి క్రమ శిక్షణ నేర్పింది అన్నారు. డాక్టర్ వద్దకు వెళ్లకుండా ఉండేందుకు నీకు నీవు స్వీయ క్రమశిక్షణతో ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. గతంలో చిన్నారులకు అమ్మలు అన్నం తినిపించాలంటే చందమామను చూపించి.. అటు ఇటు తిరుగుతూ శారీరక శ్రమ పడుతూ తినిపించే వారని.. మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత అమ్మలు పిల్లలకు సెల్ ఫోన్లు చేతిలో పెట్టి గోరుముద్దలు పెడుతున్నారని అన్నారు.

ఆరోగ్యం కోసం మిత ఆహారం.. శారీరక శ్రమ అవసరమని అభిప్రాయ పడ్డారు. చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. యోగా సాధన ద్వారా ఒత్తిడి తట్టుకునే శక్తి ఆత్మస్థైర్యం వస్తుందన్నారు. నేటి జీవన విధానంలో సాంకేతిక పరిజ్ఞానం అవసరమే కాని ఆన్లైన్ గేమ్స్ కు బానిసలు కాకుండా రోజులో కాస్త సమయం అన్ లైన్ ద్వారా విషయ పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. అదే విధంగా ప్రతి రోజు తప్పనిసరిగా అవుట్ డోర్ గేమ్స్ ఆడాలని విద్యార్థులకు సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande