బురదలో పుట్టిన తామర పువ్వుతో ఆరోగ్య సమస్యలు దూరం.. ఎలా అంటే.?
కర్నూలు, 2 ఆగస్టు (హి.స.) బురదలో తామర పువ్వు వికసిస్తుంది. దీని అందం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ పువ్వు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని అతి తక్కువమందికి మాత్రమే తెలుసు. తామర పువ్వులో ఒత్తిడి ,టెన్షన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంద
బురదలో పుట్టిన తామర పువ్వుతో ఆరోగ్య సమస్యలు దూరం.. ఎలా అంటే.?

కర్నూలు, 2 ఆగస్టు (హి.స.)

బురదలో తామర పువ్వు వికసిస్తుంది. దీని అందం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ పువ్వు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని అతి తక్కువమందికి మాత్రమే తెలుసు. తామర పువ్వులో ఒత్తిడి ,టెన్షన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రోజు తామర పువ్వు ఏయే ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి సహాయపడుతుంది.. ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

తామర పువ్వు పువ్వుని చైనా సాంప్రదాయ వైద్యంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తారు. లోటస్ లీఫ్ టీ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి నొప్పి నివారిణిగా పనిచేస్థాయి.శరీరంలో ఎక్కడైనా నొప్పి కలిగి ఉంటే.. తామర నూనెతో మసాజ్ చేయవచ్చు. ఎముకల నొప్పిని కూడా తగ్గిస్తుంది. దీనితో పాటు, ఇది పాత గాయం నొప్పిని కూడా తొలగిస్తుంది.

తామరపువ్వులోని చల్లదనం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. దీనితో పాటు, ఇది శరీర ఉష్ణోగ్రత, రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. రోజూ తామరపువ్వుని ఉపయోగిస్తుంటే.. ఫీల్-గుడ్ హార్మోన్లు కూడా పెరుగుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. మంచి నిద్ర పొందడానికి సహాయపడతాయి. డిప్రెషన్‌లో ఉన్నవారి తామరపువ్వు ప్రభావవంతమైన ఔషధం అని చెబుతున్నారు.

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలా మంది జుట్టు తెల్లబడటం, ఊడిపోవడం, పొడిబారడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరికి తామర పువ్వు మంచి ఔషధం. ఈ పువ్వుతో తయారుచేసిన నూనెను రోజూ తలకు మర్దన చేయండి. దీనివలన జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ, దృఢంగా పెరుగుతుంది.

లోటస్ ఫ్లవర్‌ టీ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీన్ని రెగ్యులర్ తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అనేక రకాల సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని వైద్య సలహాలు సూచనలతోనే పాటించాల్సి ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి

 rajesh pande