తెలంగాణ, జడ్చర్ల. 2 ఆగస్టు (హి.స.)
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు
ఉదండాపూర్ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం 175 కోట్ల రూపాయల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని విడుదల చేసింది అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు శనివారం జడ్చర్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో ఈ నిధులను మంజూరు చేయించారని ఎమ్మెల్యే చెప్పారు. డిసెంబర్ నెలలోపు మిగిలిన అన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలను కంప్లీట్ చేస్తామని ఉదండాపూర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు హామీ ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి తనకు తెలిపారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు.
2024 సెప్టెంబర్ లో 45 కోట్లు, 2025 జనవరిలో 30 కోట్లు మంజూరు కాగా నారాయణపేట, కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రాలలో జరిగిన బహిరంగ సభల సందర్భంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారన్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీని రైతుల, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏకకాలంలో 175 కోట్ల రూపాయలను మంజూరు చేశారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు