గడువు ముగిసిన మందులను రోగులకు ఇవ్వరాదు : కామారెడ్డి కలెక్టర్
తెలంగాణ, కామారెడ్డి. 2 ఆగస్టు (హి.స.) గడువు ముగిసిన(ఎక్స్పైర్ మెడిసిన్) మందులను రోగులకు ఇవ్వరాదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ వైద్య అధికారులను ఆదేశించారు. శనివారం కామారెడ్డి మండలంలోని దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల క్య
కామారెడ్డి కలెక్టర్


తెలంగాణ, కామారెడ్డి. 2 ఆగస్టు (హి.స.)

గడువు ముగిసిన(ఎక్స్పైర్ మెడిసిన్) మందులను రోగులకు ఇవ్వరాదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ వైద్య అధికారులను ఆదేశించారు. శనివారం కామారెడ్డి మండలంలోని దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల క్యాసంపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని (ఉప ఆరోగ్య కేంద్రాన్ని) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. రక్త పరీక్షల గదిని పరిశీలించి అవసరమైన వారికి ప్రాథమికంగా వైద్య పరీక్షలు కచ్చితంగా చేయాలన్నారు. అదేవిధంగా డ్రగ్ స్టోర్ ను పరిశీలించి వర్షాకాలంలో అధికంగా ఉపయోగపడే జ్వరం, విరేచనాలు, దగ్గు, ಜಲುಬು తదితర వ్యాధుల మందులను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ గదిని పరిశీలించి గర్భిణీలకు, చిన్నారులకు నిర్ణీత సమయాలలో వ్యాక్సినేషన్ వేయాలని సూచించారు.

రోజు ఎంతమంది అవుట్ పేషంట్లు ఈ ఆస్పత్రికి వస్తున్నారని అడిగి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande