దిల్లీ: 2 ,ఆగస్టు (హి.స.) దేశంలోని రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి సంవత్సరం రైతులకు రూ. 6,000 పెట్టుబడి సాయంగా అందిస్తుంది. దీన్ని మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. ఇప్పటి వరకు 19 విడతల సాయం అన్నదాతలకు అందించగా.. ఈరోజు (ఆగస్టు 2) 20వ విడత పీఎం కిసాన్ నిధులను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ప్రధాని మోడీ విడుదల చేయనున్నారు. సుమారు 9.7 కోట్ల మంది రైతులకు సుమారు రూ.20,500 కోట్లకు పైగా నిధులను వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
ఇక, ఈ పథకాన్ని అందరూ పొందలేరు. ప్రభుత్వ ఉద్యోగులు, రూ.10 వేల కంటే ఎక్కువ పెన్షన్ పొందేవారు. డాక్టర్లు, ఇంజనీర్లు లాంటి నిపుణులు ఈ పథకానికి అనర్హులు. ఆధార్‌తో లింక్ చేయని బ్యాంకు ఖాతాలు ఉన్నవారు మరి ముఖ్యంగా అర్హులు కారు. అలాగే, ఈ పథకం పొందుతున్న రైలులు e-KYC పూర్తి చేయకపోతే కూడా పీఎం కిసాన్ డబ్బుల అందవని గుర్తు పెట్టుకోవాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ