అమరావతి, 2 ఆగస్టు (హి.స.)
హంద్రీ-నీవా ప్రధాన కాలువలో కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద ఉన్న 8వ పంపు హౌస్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. మొత్తం 12 పంపులు ఉండగా.. ఇప్పటి వరకు గరిష్ఠంగా ఆరు పంపులతో మాత్రమే నీటిని ఎత్తిపోశారు. అయితే ఆ కేంద్రం నుంచి ప్రస్తుతం 10 పంపులతో 3150 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాలువను విస్తరించడంతో ఎక్కువ నీటిని ఎత్తిపోయడానికి మార్గం ఏర్పడింది. హంద్రీ-నీవా ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా 10 పంపులను ఆన్ చేసి కాలువకు నీటిని విడుదల
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ