డిల్లీ, 2 ఆగస్టు (హి.స.)
ఎన్నికల సంఘం, భాజపాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) చేసిన తీవ్రవ్యాఖ్యలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఆ అణుబాంబును పేల్చనివ్వండని వ్యాఖ్యానించారు. ‘‘తనవద్ద అణుబాంబు ఉందని రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఆయన దానిని వెంటనే పేల్చాలి. అది పేలేటప్పుడు దానివల్ల తనకు హాని కలగకుండా చూసుకోవాలి. గతంలో భూకంపం అంటూ హెచ్చరికలు చేశారు. కానీ తర్వాత అది తుస్సుమంది’’ అని కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ (ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి)పై ఇలాంటి ప్రకటనలు చేయడం ప్రతిపక్ష నేతకు తగదని మండిపడ్డారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ (Election Commission) నేడు విడుదల చేసింది. అయితే, ఈ ప్రక్రియను ముందు నుంచీ వ్యతిరేకిస్తోన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు