రిజర్వేషన్ల అమలుకు కేంద్రమే అడ్డు.. మంత్రి శ్రీధర్ బాబు
కరీంనగర్2 ఆగస్టు (హి.స.) రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, కేంద్ర ప్రభుత్వం మాత్రం అడ్డుపడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శనివారం మలహర్ మండల కేంద్రంలోని తాడిచె
మంత్రి శ్రీధర్ బాబు


కరీంనగర్2 ఆగస్టు (హి.స.)

రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, కేంద్ర ప్రభుత్వం మాత్రం అడ్డుపడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శనివారం మలహర్ మండల కేంద్రంలోని తాడిచెర్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. వెనుక బడిన తరగతుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తుందని కొనియాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించినప్పటికీ ఇప్పటి వరకు ఆమోదం లభించలేదని అన్నారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కోసం కేబినెట్ లో నిర్ణయించి ఆర్డినెన్స్ తెచ్చినప్పటికీ ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదని తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande