హైదరాబాద్, 2 ఆగస్టు (హి.స.) కడుపులో కత్తులు పెట్టుకొని రాష్ట్రంలో
బీజేపీ రాజకీయం చేస్తోందని మంత్రి పొన్నo ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన మహాధర్నాపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని అన్నారు.
కానీ, మస్లింల పేరిట బలహీనవర్గాలకు బీజేపీ తీరని అన్యాయం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందని ఆరోపించారు. బీసీకు న్యాయం చేయాలనే అలోచనే ఉంటే.. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఢిల్లీకి వెళ్లి తెలంగాణలో 42 బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా నేడు బలహీనవర్గాల బద్ద వ్యతిరేకి రాంచందర్ రావు చేపట్టిన మహాధర్నాలో పాల్గొని వారంతా బీసీ వ్యతిరేకులుగా మారారని కామెంట్ చేశారు. నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎలా అయితే పోరాటం చేశామో.. నేడు బీసీ రిజర్వేషన్లపై కూడా అదే మాదిరిగా కాంగ్రెస్ పోరాటం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..