ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తదితరుల పేర్లు చెప్పాలని బలవంతం
బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తదితరుల పేర్లు చెప్పాలని బలవంతం


హైదరాబాద్, 2 ఆగస్టు (హి.స.)

మహారాష్ట్రలోని మాలెగావ్‌ పట్టణంలో 17 ఏళ్ల క్రితం ఆరుగుర్ని బలి తీసుకున్న పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో నిర్దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తనను అప్పటి యూపీఏ ప్రభుత్వం తీవ్రంగా వేధించిందన్నారు.

దీనిపై ప్రజ్ఞా ఠాకూర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ, అప్పటి యూఏపీ ప్రభుత్వం కలిసి నాపై తప్పడు కేసు పెట్టి ఇరికించారు. ఈ కేసులో బీజీపీ పెద్ద నాయకులను కూడా ఇరికించాలని చూశారు.

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తదితరుల పేర్లు చెప్పాలని నన్ను బలవంతం చేసి హింసించారు. ఇది ఒక కుట్రపూరితమైన కేసు. కనీసం ఆధారాలు లేని కేసు. కాంగ్రెస్‌ అనేది మత వ్యతిరేక శక్తి. టెర్రరిస్టులను పోషించే పార్టీ,. జాతీయ పార్టీ అని చెప్పుకునే అర్హత కానీ హోదా కానీ ఆ పార్టీకి లేవు’ అని తీవ్రంగా విమర్శించారు ప్రజ్ఞా ఠాకూర్.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande