బెంగళూర్, 2 ఆగస్టు (హి.స.)గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో సంచలనంగా మారిన ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఈ రోజు కోర్టు తీర్పు వెల్లడించింది. అత్యాచారం కేసులో కోర్టు అతడికి ‘‘జీవితఖైదు’’ విధించింది. ప్రజ్వల్ రేవణ్ణపై ఆయన ఇంట్లో పనిచేసే మహిళ అత్యాచారం కేసు పెట్టింది. ఈ కేసులో ఆయనను బెంగళూర్ కోర్టు దోషిగా తేల్చింది. అత్యాచారం సమయంలో రికార్డ్ చేసిన వీడియోతో తనను బెదిరించినట్లు మహిళ ఫిర్యాదు చేయడంతో ప్రజ్వల్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలైన మహిళకు రూ. 7 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
జనతాదళ్ (సెక్యులర్) మాజీ ఎంపీ అయిన ప్రజ్వల్ రేవణ్ణ గత లోక్‌సభ ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మాజీ ప్రధాని హెడ్‌డీ దేవెగౌడకు ప్రజ్వల్ మనవడు. 48 ఏళ్ల మహిళపై లైంగిక వేధింపుల వీడియోను ప్రసారం చేశాడని కూడా ఇతడిపై అభియోగాలు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు