హైదరాబాద్, 2 ఆగస్టు (హి.స.) రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం సింగంపల్లి గ్రామ కార్యదర్శి జంగయ్యను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విధులపట్ల నిర్లక్ష్యం వహించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దొంగ హాజరును గుర్తించడంతో సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. జులై 18 వ తేదీ వరకు సింగంపల్లి గ్రామకార్యదర్శి జంగయ్య ముఖ గుర్తింపు హాజరును నమోదు చేయకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడం, అదేవిధంగా కొత్తకుంట తండా ఇన్చార్జిగా వ్యవహరిస్తూ కొత్తకుంట గ్రామంలో జులై 18న దొంగ హాజరు నమోదును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తించినట్లు సస్పెండ్ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..