ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు - ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 2 ఆగస్టు (హి.స.) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్షకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య సంపూర్ణ మద్దతు తెలిపారు. తాజాగా తెలంగాణ జాగృతి నేతలు ఆర్. కృష్ణయ్యను కలిశార
ఆర్ కృష్ణయ్య కీలక


హైదరాబాద్, 2 ఆగస్టు (హి.స.)

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్షకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య సంపూర్ణ మద్దతు తెలిపారు. తాజాగా తెలంగాణ జాగృతి నేతలు ఆర్. కృష్ణయ్యను కలిశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిస్వార్ధంగా బీసీల కోసం దీక్ష చేస్తోందన్నారు. కవిత దీక్షతో బీసీల ఉద్యమం మరింత బలోపేతం అవుతుందన్నారు. దాదాపు 40, 50 ఏళ్ల నుంచి బీసీల కోసం 12 వేలకు పైగా ఉద్యమాలు చేసినట్లు తెలిపారు. బీసీల కోసం కవిత చేస్తున్న ఉద్యమం బీసీల పట్ల మరింత బలాన్ని చేకూరుస్తోందని, అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. కవితను మనసారా అభినందిస్తున్నాను.. కవిత పట్టుదలతో దీక్ష చేస్తుంది.. ఆమె దీక్ష విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను.. అని కృష్ణయ్య వ్యాఖ్యనించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande