రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయం.. పార్టీ శ్రేణులకు గులాబీ బాస్ పిలుపు
హైదరాబాద్, 2 ఆగస్టు (హి.స.) పార్టీ ఫిరాయిచిన ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్
కెసిఆర్


హైదరాబాద్, 2 ఆగస్టు (హి.స.)

పార్టీ ఫిరాయిచిన ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం పక్కా కామెంట్ చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని నాయకులకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలా కృషి చేయాలని అన్నారు. ఆ ఎన్నికల తర్వాతే పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిద్దామని కేసీఆర్ పేర్కొన్నారు.

బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ స్టేట్మెంట్లు ఇస్తున్నా... సీఎం రేవంత్ ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఊరూరా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి లోక్సభలో డజన్ మంది ఎంపీలు ఉంటే బనకచర్ల అంశంపై గట్టిగా కొట్లాడేవారని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఫైర్ అయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande