హైదరాబాద్, 2 ఆగస్టు (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పాలన గాలికొదిలేసి ఢిల్లీ బాటపడుతున్నారని.. ఢిల్లీ బాస్ ను కలిసేందుకు క్యూ కడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
విమర్శించారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా సీఎం ఢిల్లీ టూర్ కు సంబంధించి ఆయన శనివారం ట్వీట్ చేశారు.
రేవంత్ తన 50వ విమాన (ఢిల్లీ) సందర్శనను 20 నెలల్లోనే పూర్తి చేశాడు. ఇదేదో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి కాదు, వాటిని వేలం వేయడానికి అని ఎద్దేవా చేశారు.
ప్రతి యాత్రను ద్రోహం, వెన్నుపోటు కోసమే చేయడం జరిగిందని కేటీఆర్ మండిపడ్డారు. హస్తిన పర్యటనల ద్వారా తెలంగాణకు లాభం గుండు సున్నా అయితే తన గురువుకు నీటి హక్కులు బహుమతిగా ఇచ్చారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ ఢిల్లీ బాస్లకు కోట్లు ప్రతిజ్ఞ చేశారని ఆరోపించారు. కష్టపడి సంపాదించిన తెలంగాణ సంపద పట్టపగలు దొంగిలించబడిందన్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలు చూస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..