చిత్తూరు జిల్లా.కుప్పంలో ఘోర రోడ్డు.ప్రమాదం జరిగింది
చిత్తూరు , 2 ఆగస్టు (హి.స.)జిల్లా కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలబడి ఉన్న ఇద్దరు యువతులపైకి లారీ దూసుకురావడంతో వారు క్షణాల్లో అప్రమత్తమై ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే లారీ ద్విచక్రవాహనాన్
చిత్తూరు జిల్లా.కుప్పంలో ఘోర రోడ్డు.ప్రమాదం జరిగింది


చిత్తూరు , 2 ఆగస్టు (హి.స.)జిల్లా కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలబడి ఉన్న ఇద్దరు యువతులపైకి లారీ దూసుకురావడంతో వారు క్షణాల్లో అప్రమత్తమై ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఆర్టీసీ కూడలిలో బైపాస్ రహదారి వద్ద ఫ్లైఓవర్‌ పై నుంచి లారీ అతివేగంగా దూసుకొచ్చింది. బైక్‌పై వస్తున్న యువకులను ఢీకొడుతూ వెళ్లి ఆగి ఉన్న పాల ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో యువకులు రెండు వాహనాల మధ్య చిక్కుకుపోగా.. గౌతమ్‌ అనే వ్యక్తి చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ను బెంగళూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. సంబంధిత దృశ్యాలు సీసీకెమెరాల్లో నమోదయ్యాయి.ఈ వార్త

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande