రేపల్లె, 2 ఆగస్టు (హి.స.)
, : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా రేపల్లెలో మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఉన్న పేదలకోసం తానా ఫౌండేషన్ 'అన్నపూర్ణ' కార్యక్రమాన్ని గతంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా అభాగ్యులకు అవసరం వున్న చోట భోజనాన్ని అందిస్తున్నారు.
తానా ఫౌండేషన్ మాజీ అధ్యక్షులు శశికాంత్ వల్లేపల్లి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు రేపల్లెలో నిర్వహించారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి మాట్లాడుతూ, తానా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తోంది.. అన్నీ దానాల్లో కన్నా అన్నదానం మిన్న అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నపూర్ణ పేరుతో పేదలకు అన్నదానం చేస్తున్నామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ