తుని, 2 ఆగస్టు (హి.స.)
కాకినాడ జిల్లా తునిలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొన్నారు. పట్టణంలో ఎంపీడీవో కార్యాలయంలో సుమారు 27 వేల మంది లబ్ధిదారులకు రూ. 18.66 కోట్లు చెక్కును ఎమ్మెల్యే దివ్య రైతులకు అందించారు. ఏన్డీయే ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ