.ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మచిలీపట్నం ఎంపీ. బాలశౌరి కార్యాలయంలో. పనిచేస్తున్న గోపాల్ సింగ్ అనే వ్యక్తి.డబ్బులు. వసూలు
మచిలీపట్నం, 2 ఆగస్టు (హి.స.) : ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కార్యాలయంలో పని చేస్తున్న గోపాల్‌ సింగ్‌ అనే వ్యక్తి డబ్బులు వసూలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 100 మంది నుంచి నగదు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తాను బాలశౌర
.ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మచిలీపట్నం ఎంపీ. బాలశౌరి కార్యాలయంలో. పనిచేస్తున్న గోపాల్ సింగ్ అనే వ్యక్తి.డబ్బులు. వసూలు


మచిలీపట్నం, 2 ఆగస్టు (హి.స.)

: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కార్యాలయంలో పని చేస్తున్న గోపాల్‌ సింగ్‌ అనే వ్యక్తి డబ్బులు వసూలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 100 మంది నుంచి నగదు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తాను బాలశౌరి పీఏనని, మచిలీపట్నంలోని మెడికల్‌ కళాశాల, కృష్ణ యూనివర్సిటీ, విద్యుత్‌శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశాడు. ఇలా మొత్తం దాదాపు రూ.కోటిన్నర వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande