భాజపా నూతన సారథి ఎంపిక మరింత ఆలస్యం.
దిల్లీ: 2 ,ఆగస్టు (హి.స.) భాజపా (BJP) నూతన సారథి ఎంపిక మరింత ఆలస్యం కానుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే భాజపా జాతీయధ్యక్షుడి పదవికి ఎన్నికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ వర్గాలు పేర్కొన్నాయని పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఉప
BJP


దిల్లీ: 2 ,ఆగస్టు (హి.స.) భాజపా (BJP) నూతన సారథి ఎంపిక మరింత ఆలస్యం కానుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే భాజపా జాతీయధ్యక్షుడి పదవికి ఎన్నికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ వర్గాలు పేర్కొన్నాయని పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఉప రాష్ట్రపతి ఎన్నిక పూర్తయిన తర్వాతే భాజపా నూతన అధ్యక్షుడిని ఎంపిక చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, బిహార్‌లో ఎన్నికలకు ముందే ఈ ప్రకటన ఉంటుందని వెల్లడించాయి. ఈ ఎంపికకు సంబంధించి ఇప్పటికే కొంతమంది వ్యక్తుల పేర్లను పార్టీ అధినేతలు పరిశీలించినట్లు వివరించారు. ఇక, ఈ జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకు ఇచ్చే అవకాశం ఉందంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ భాజపా ఎంపీ పురందేశ్వరీతో సహా పలువురి పేర్లు వినిపించాయి.

ఇక, భాజపా సంస్థాగత ఎన్నికలు ప్రతి మూడేళ్లకోసారి జరుగుతుంటాయి

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande