ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. నదిపై ఉన్న అన్ని డ్యామ్‌ల గేట్లు ఎత్తివేత
అమరావతి, 2 ఆగస్టు (హి.స.)కృష్ణ నది జన్మస్థానంతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల (Heavy rains) కారణంగా.. వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలోనే కృష్ణ నదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, సాగర్, టైల్ పాండ్, పులిచింతల, కృష్ణ బ్
ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. నదిపై ఉన్న అన్ని డ్యామ్‌ల గేట్లు ఎత్తివేత


అమరావతి, 2 ఆగస్టు (హి.స.)కృష్ణ నది జన్మస్థానంతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల (Heavy rains) కారణంగా.. వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలోనే కృష్ణ నదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, సాగర్, టైల్ పాండ్, పులిచింతల, కృష్ణ బ్యారేజీ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా జూరాల, శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) గత నెల రోజులుగా భారీ వరద వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ రోజు కూడా జలాశయానికి ఎగువ నుంచి భారీ వరద కొనసాగుతుంది. దీంతో డ్యామ్ అధికారులు అప్రమత్తమై 8 గేట్లను 10 అడుగులు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఎగువ నుంచి 2,70,640 క్యూసెక్కుల వరద వస్తుంది.

8 గేట్లు, కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా 2,76,461 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దింతో దిగువన ఉన్న నాగార్జునసాగర్‌ (Nagarjunasagar)కు వరద కొనసాగుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande