ట్రంప్‌ మాటల్లో నిజమే లేదు: భారత ప్రభుత్వ వర్గాలు
దిల్లీ: 2 ,ఆగస్టు (హి.స.) రష్యా నుంచి చమురు దిగుమతుల (Russian Oil Imports)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఓర్వలేనితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని వెల్లడించినప్పటికీ.. రష్యా చమురును భారత్‌ కొనుగోలు చే
US


దిల్లీ: 2 ,ఆగస్టు (హి.స.) రష్యా నుంచి చమురు దిగుమతుల (Russian Oil Imports)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఓర్వలేనితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని వెల్లడించినప్పటికీ.. రష్యా చమురును భారత్‌ కొనుగోలు చేయదని ట్రంప్ మరోసారి వ్యాఖ్యలు చేశారు. వీటికి కూడా కౌంటర్ వచ్చింది.

‘‘ఇకపై రష్యా ఆయిల్‌ను భారత ప్రభుత్వం కొనుగోలు చేయదన్న విషయం నావరకు వచ్చింది. అది నిజమా..?కాదా..? అనేది నాకు తెలియదు. అది మంచి నిర్ణయమే అయితే ఏం జరుగుతుందో చూద్దాం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వ వర్గాల నుంచి దీటైన స్పందన వచ్చింది. ‘‘భారత చమురు సంస్థలు రష్యా సరఫరాదారుల నుంచి కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయి. ధర, రవాణా, ఇతర ఆర్థిక అంశాల ఆధారాలు ఇక్కడ కీలకంగా ఉంటాయి. భారత్‌ 85 శాతం ఇంధనం దిగుమతి చేసుకుంటోంది.

సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో మూడో అతిపెద్ద వినియోదారుగా ఉన్న భారత్‌.. అంతర్జాతీయ నిబంధనలకు పూర్తిగా కట్టుబడి.. అందుబాటు ధరల్లో (Crude Oil Prices) లభ్యమయ్యే చమురు కొనుగోలును కొనసాగిస్తుంది. దేశ ఇంధన నిర్ణయాలు జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande