నా హృదయం దు:ఖంతో నిండిపోయింది.. ప్రధాని మోడీ ఎమోషనల్ కామెంట్స్
ఢిల్లీ, 2 ఆగస్టు (హి.స.)పహల్గాం ఉగ్రదాడితో తన హృదయం తీవ్ర దు:ఖంతో నిడిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇవాళ ఆయన వారణాసిలోని కాశీ క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనం
Modi


ఢిల్లీ, 2 ఆగస్టు (హి.స.)పహల్గాం ఉగ్రదాడితో తన హృదయం తీవ్ర దు:ఖంతో నిడిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇవాళ ఆయన వారణాసిలోని కాశీ క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేశారు. 20వ విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 9.7 కోట్ల రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లకుపైగా నగదును అధికారులు జమ చేశారు. మరోవైపు ప్రధాని ప్రసంగాన్ని ప్రకాశం జిల్లా వీరాయపాలెంలో రైతులతో కలిసి సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఎల్ఈడీలో వీక్షిస్తున్నారు. కాసేపట్లో ఆయన ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి సభలో మాట్లాడుతూ.. కాశీ వాసుల కోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత తాను కాశీకి రావడం ఇదే తొలిసారి అని కామెంట్ చేశారు. పహల్గాంలో 26 మంది అమాయక పౌరులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని.. తన హృదయం దు:ఖంతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాశీ విశ్వనాథుడు, ఆ మహాదేవుడి ఆశీర్వాదంతో ఉగ్రవాదులు, దాయాది దేశంపై ప్రతీకారం తీర్చుకన్నామని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande