అమరావతి, 2 ఆగస్టు (హి.స.)స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య (Pingali Venkaiah) 149వ జయంతి వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వైభవోపేతంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను స్మరించుకుంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ఇండియన్ ఫ్లాగ్ క్రియేటర్ పింగళి వెంకయ్య గారి 149వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నానని అన్నారు. ఆజన్మాంతం భరతమాత సేవలో తరించిన మహనీయుడు పింగళి అని కొనియాడారు. జాతీయ పతాకం (National Flag) వినువీధిల్లో ఎగురుతున్నంత కాలం పింగళి వెంకయ్య మనకు గుర్తుండిపోతారని కామెంట్ చేశారు. ప్రతి భారతీయుడు ఎప్పటికీ గర్వించే త్రివర్ణ పతాకాన్ని అందించిన ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులర్పిద్దాం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
---------------
- Tags
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి